సర్వే నిర్వహించి సఫాయి కర్మచారులు జాబితాను రూపొందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలులో ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ యాక్ట్-2013 అమలుపై సమావేశం నిర్వహించి, మాట్లాడారు. మునిసిపాలిటీలు, ఆసుపత్రులు, రైల్వేలు, శానిటేషన్ జరిగే ప్రదేశాల్లో సఫాయి కర్మచారులు ఉంటారని, సర్వేచేసి జాబితాను తయారు చేయాలన్నారు. డివిజినల్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.