మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి పదార్థాలను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు కాపాడాలని కోరారు.