ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకుడు తన్విందర్ సింగ్ శివ సేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌లు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం కర్నూలు డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను మురళీకృష్ణ కలిసి, ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడారు. రాహుల్ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమన్నారు.