కర్నూలు రెవెన్యూ డివిజనల్ పరిధిలో రేషన్ డీలర్ పోస్టుల కోసం ఆదివారం రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వరరెడ్డి శనివారం ప్రకటించారు. కర్నూలు అర్బన్, రూరల్, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, గూడూరు, బెళగల్, వెల్దూర్తి మండలాల్లో 74 ఖాళీలకు 875 దరఖాస్తులు వచ్చాయి. రాత పరీక్షలు కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలలో నిర్వహిస్తారన్నారు.