కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన

58చూసినవారు
దళిత గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పెద్దకడబూరు మండలం ఎమ్మార్పీఎస్, దళిత నాయకులు హెచ్చరించారు. కల్లుకుంటలో గోవిందమ్మపై జరిగిన దాడికి నిరసనగా కర్నూలు కలెక్టర్ ఆఫీసు ముందు గురువారం ధర్నా చేపట్టారు. గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, బాధిత కుటుంబానికి అండగా నిలవాలన్నారు. నిజమైన నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్