ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి గూళ్యం గ్రామానికి చెందిన శివప్ప(18) ఆదివారం స్నేహితులతో కలిసి ఎల్లెల్సీ కాలువలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈత రాకపోయినా కాలువలో ఈత కొట్టడం ప్రయత్నించి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో స్నేహితులు గాలించగా శివప్ప శవమై తేలాడు. అతని మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.