కర్నూలు నగరపాలక సంస్థ స్థాయీ సంఘ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై కార్పొరేటర్లకు కమిషనర్ పి. వి. రామలింగేశ్వర్ అవగాహన కల్పించారు. బుధవారం నగరపాలక కౌన్సిల్ హాలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మేయర్ బి. వై. రామయ్య, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ముందుగా పోలింగ్ జరిగే విధానాన్ని, ఫలితాల లెక్కింపు ప్రక్రియను వివరించారు. కార్పొరేటర్లు పార్టీ కండువాలు ధరించి రాకూడదన్నారు.