జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం కర్నూలు నగరంలో మాంసం విక్రయాలు చేపట్టరాదని నగరపాలక ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి. విశ్వేశ్వర రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కబేళాలు, మాంసం దుకాణాలు తప్పనిసరిగా మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారం అమ్మకాలు చేపట్టరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి విక్రయాలు సాగిస్తే భారీ జరిమానాతో పాటు వ్యాపార లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.