బీడీ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేసి సంక్షేమానికి నిధులు కేటాయించాలని బీడీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఓబులు అన్నారు. ఆదివారం కర్నూలులోని కార్మిక, కర్షక భవన్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో బీడీ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల అనేక హక్కులను కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.