ఆదోని పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ లో చదువుతూ అస్వస్థతకు గురైన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో డీఆర్వో చిరంజీవిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. హాస్టల్లో 132 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. బాలికలకు ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు.