చైల్డ్ హుడ్ క్యాన్సర్ ను ప్రారంభదశలో గుర్తిస్తే పూర్తిస్థాయిలో నివారణ సాధ్యమని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. శనివారం విశ్వభారతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో చైల్డ్ హుడ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు మారథాన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, ఆయన మాట్లాడారు. క్యాన్సర్ అనేది పెద్ద వారిలోనే గాక చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుందన్నారు.