పెళ్లిలో బంగారం పోయిందన్న భయంతో పురుగుమందు తాగిన చిన్నతుంభళం గ్రామానికి చెందిన కురువ నాగవేణి (14) అనే బాలిక సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 4న కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో పెళ్లికి వెళ్లిన ఆమె అక్కడ బంగారం పోగొట్టుకుంది. తల్లిదండ్రులు కోడతారన్న భయంతో 6న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్సలో మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.