కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ 29 గేట్లను మూసివేసినట్లు జలాశయం జేఈ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడారు. సుంకేసుల జలాశయానికి ప్రస్తుతం 425 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే ఉండడంతో, గేట్లు మూసివేశామన్నారు. కేసీ కెనాల్ కు 1, 188 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. సుంకేసుల రిజర్వాయర్ లో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.