కర్నూలు నగరంలో ధనలక్ష్మీ నగర్ పార్క్ నుండి కేంద్రీయ విద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రజా వేదిక కార్యక్రమంలో పీ4 విధానంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర తదితర స్టాళ్లను సీఎం పరిశీలించారు.