కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి సి. క్యాంపు రైతు బజార్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు శనివారం మంత్రి టీజీ భరత్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డితో పాటు స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడి, సేంద్రీయ ఎరువుల తయారీని పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మురుగు నిర్వహణపై చర్చించారు.