స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ విందు
By C. Ramanjaneyulu 79చూసినవారుస్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి. రంజిత్ బాషా గురువారం రాత్రి విందు ఇచ్చారు. పరిశ్ర మల శాఖ మంత్రి టి. జి. భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగ రాజు, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం, ఎమ్మిగనూరు, ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, డా. పార్థసా రథి, ఎస్పీ జి. బిందుమాధవ్, తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.