కర్నూలు నగరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కేసీ కెనాల్ వినాయక ఘాట్ ను గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఘాట్ వద్ద మొదలైన పిచ్చిమొక్కల తొలగింపు, పరిశుభ్రత, పారిశుధ్యం పనులను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. నిమజ్జనం రోజున నగర పాలక సంస్థ చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. నగరపాలక ఆరోగ్య అధికారి విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.