కర్నూలు నగరంలోని ఎర్రబురుజు 11వ వార్డు ప్రాంతంలో మంచినీటి సరఫరా రెండు రోజులుగా నిలిచిపోవటంపై సీపీఎం నగర కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్ తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇద్దరు చనిపోవడంతో దహన సంస్కారాలకు, మట్టి కార్యక్రమాలకు నీరు ఎంతో అవసరమని ఇలాంటి సమయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నీటిసరఫరా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.