కర్నూలు నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలో కండేరి, సాయి బాబా, కొత్తపేటలో పారిశుధ్య పనులను నగర పాలక సంస్థ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ బుధవారం పరిశీలించి, ఆయన మాట్లాడారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, రహదారులు పరిశుభ్రంగా ఉంచాలని, మురుగు కాలువల్లో చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. వంద మంది కార్మికులు 16 మంది కార్యదర్శులను విజయవాడకు పంపించామన్నారు.