కర్నూలు: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. నలుగురికి జరిమానా

77చూసినవారు
కర్నూలు: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. నలుగురికి జరిమానా
కర్నూలు జిల్లా ఇంచార్జి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో కర్నూలు మూడవ పట్టణ పోలీసులు మంగళవారం డ్రంకెన్ డ్రైవ్ అండ్ ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురిని పట్టుకుని, వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హజరు చేశారు. జేఎఫ్ సీఎం కోర్టు వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్