కర్నూలు రూరల్ మండలం ఉల్చాల గ్రామంలో బుధవారం ఏరువాక పున్నమి సంబరాలు ఘనంగా జరిగాయి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డప్పు దరువులతో పెద్ద ఎత్తున చిందులు వేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెట్టుబడి సహాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.