పెద్దకడబురు మండలం హెచ్.మరువని గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. మురవని గ్రామ శివారులోని చెత్త సంపద కేంద్రంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతన్నట్లు పోలీసులకు సమచారం వచ్చింది. దీంతో మరువని గ్రామానికి చెందిన దేవదానం, హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు, దుర్గా వెంకట ప్రభాకర్, స్వామీజీ బాల రెడ్డి, గద్వాల జిల్లాకు చెందిన కృష్ణలను అరెస్టు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.