చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం

52చూసినవారు
చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం
సంఘమిత్ర సేవా సమితి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో చెంచులకు, గిరిజనులకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఎర్రమటం, పెద్ద గుమ్మడాపురం చెంచుగూడెంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో చెంచులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ ప్రతినెలా చెంచులకు, గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్