అహింసనే ఆయుధంగా మలుచుకుని స్వాతంత్రం సంపాదించిన మహనీయుడు మహాత్మ గాంధీజీ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి. జి. భరత్ కొనియాడారు. బుధవారం మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని కర్నూలు కలెక్టరేట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి రాష్ట్ర మంత్రి టిజి భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.