కర్నూలు జిల్లాలో నిత్యం దళితులపై దాడులు జరుగుతున్న నివారించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు అన్నారు. శనివారం దళిత మహిళ గోవిందమ్మను వివస్త్రను చేసి దూషించిన సంఘటనపై కర్నూలులో వారు మాట్లాడారు. దళిత మహిళను ఘోరంగా అవమానించిన సంఘటనపై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కొంతమందిపై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు.