కర్నూలు జిల్లాలో 45 వ్యవసాయ అధికారుల బదిలీలకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యింది. ఆదోని మండల వ్యవసాయ అధికారిగా పాపిరెడ్డి నియమితులయ్యారు. కీలకమైన కల్లూరు ఏఓగా విష్ణువర్ధన రెడ్డి, ఎమ్మిగనూరు ఏఓగా శివశంకర్, ఇతర ఫోకల్ పోస్టులకు సీనియర్ అధికారులు బదిలీ చేశారు. ఈ నియామకాలు వ్యవసాయ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. కర్నూలు ఏడీ కార్యాలయంలో టెక్నికల్ ఏఓగా ఉన్న దస్తగిరిరెడ్డి గూడూరు ఏఓగా బదిలీ అయ్యారు.