కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షం జోరు

66చూసినవారు
కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షం జోరు
కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షాలు కురిశాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కౌతాళం (58.2 మిమీ), క్రిష్ణగిరి (57.8 మిమీ) మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. కోడుమూరు, చిప్పగిరి, కోసిగి, తుగ్గలి, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, హొలగొందా వంటి ప్రాంతాల్లోనూ వర్షపాతం కనిపించింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ కాగా ఇప్పటి వరకు 18.2 మిమీ వర్షమే పడింది.

సంబంధిత పోస్ట్