కర్నూలు యార్డుకు భారీగా ఉల్లి.. నేడు మార్కెట్ కు తెవద్దు

72చూసినవారు
కర్నూలు యార్డుకు భారీగా ఉల్లి.. నేడు మార్కెట్ కు తెవద్దు
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం భారీగా ఉల్లిని రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. దాదాపు 28, 024 బస్తాలు వచ్చినందున మార్కెట్ యార్డులోని ఉల్లి గోదాములు, షెడ్లు, మాధవాచారి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఉల్లిగడ్డలను లారీలతో బయటకు పంపేందుకు ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండటం వల్ల 1వ తేదీన ఉల్లిగడ్డలు మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్