మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని కర్నూలు నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగర పాలక కమిషనర్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న చోట మొక్కలు నాటి కాపాడాలన్నారు. అలాగే కర్నూలులో పారిశుద్ధ్యం మెరుగు పడాలన్నారు. పలువీధుల్లో పారిశుద్ధ్యం మెరుగు పడాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖాధికారి విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.