కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పట్టణంలోని సిగ్నల్స్ ఉన్న కూడళ్లలో ఆర్ఎల్వీడీ సిస్టం అమలులోకి వచ్చిందని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిగ్నల్ జంప్ చేసిన వాహనాలకు ఆటోమేటిక్‌గా చలానాలు జారీ అవుతాయి. పదే పదే నిబంధనలు అతిక్రమిస్తే ఫైన్ రెట్టింపు అవుతుందని, చలానాలు సకాలంలో చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేస్తామని, ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.