రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం కర్నూలు నగరంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం రాత్రి విజయవాడ నుంచి రైలు మార్గంలో డోన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంగా కర్నూలు వచ్చారు. రాత్రి 8 గంటలకు డోన్‌కు బయలుదేరి, అక్కడి నుంచి రాత్రి 9.05కి విజయవాడకు రైలు ద్వారా తిరుగుప్రయాణం చేస్తున్నారు.