జిల్లాలో 68 మందికి స్థానచలనం ఏడుగురికి హెచ్సీలుగా పదోన్నతి

59చూసినవారు
జిల్లాలో 68 మందికి స్థానచలనం ఏడుగురికి హెచ్సీలుగా పదోన్నతి
కర్నూలు జిల్లా ఎక్సైజ్ శాఖలో విడతల వారీగా బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం సెబ్ విభాగంలో ఉన్న వారికి ఎక్సైజ్ శాఖకు కేటాయించడమే కాక వారిని బదిలీ చేసి పోస్టింగులు కూడా కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 136 మంది కానిస్టేబుళ్లు, 68 మంది హెడ్ కానిస్టేబుళ్లకు స్థానచలనం కల్పిస్తూ కర్నూలు నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురికి హెచ్సీలుగా పదోన్నతి కల్పించారు.

సంబంధిత పోస్ట్