కర్నూలు జిల్లాకు 2014లో సీఎం చంద్రబాబు ప్రకటించిన ఓర్వకల్లు పారిశ్రామిక హబ్, ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్, ఆదోని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు, పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఆలూరులో జింకల పార్కు ఏర్పాటుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ శనివారం కోరారు. వెనకబడిన జిల్లాగా ఉందని సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలన్నారు.