కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓపీ కౌంటర్, క్యాజువాలిటీ విభాగాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలోని ఈ-డిజిటల్ ఓపీ కౌంటర్, ఇతర ఓపీ కౌంటర్లను పరిశీలించామన్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరును మెరుగు పరిచేందుకు పలు సూచనలు చేశామని తెలిపారు. ఓపీ కోసం పేషెంట్ల రద్దీ దృష్ట్యా త్వరగా ఓపీ ఇచ్చే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.