దరఖాస్తుల ఆహ్వానం

79చూసినవారు
దరఖాస్తుల ఆహ్వానం
భారత ప్రభుత్వం తపాల శాఖ కర్నూలు జిల్లాలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా కమీషన్ పద్ధతిలో పని చేయుటకు దరఖాస్తులు ఆహానిస్తునట్లు కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలియచేసారు. కనీస విద్యార్హత 10 వ తరగతి ఆ పైన ఉన్న వారు అర్హులన్నారు. వయో పరిమితి 19 నుంచి 55, నిరుద్యోగులు, గృహిణి లు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, అంగన్వాడి వర్కర్స్, రిటైర్డు ఉద్యోగులు అందరూ అర్హులే అన్నారు. ఆసక్తి గల వారు కొండారెడ్డి బురుజు దగ్గర గల సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసు నందు సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు శ్రీ హరి కృష్ణ రెడ్డి, డెవలప్మెంట్ ఆఫీసర్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫోన్ నెంబర్ 7013029312 వారిని సంప్రదించ వలసింది గా తెలియచేశారు.

సంబంధిత పోస్ట్