కర్నూలు జిల్లాలో సబ్సిడీపై దివ్యాంగులకు అందించే మూడు చక్రాల మోటారు వాహనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరం సర్టిఫికెట్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు, వ్యాపారం లేదా ఏదైనా సంస్థలో పని చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ వాహనం రిజిస్ట్రేషన్ తదితర పత్రాలను జత పరచాలని తెలిపారు.