తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయించిన జగన్ ను జైలుకు పంపించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో మంచి ప్రభుత్వంలో మాట్లాడారు. ఐదేళ్ల కాలంలో జగన్ సాగించిన అవినీతి, మాఫియా పాలనను ప్రజలు ఓటుతో తరిమి కొట్టి కూటమికి అవకాశం ఇచ్చారన్నారు. వంద రోజుల పాలనలో మందికి మేలే చేకూరిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పట్టించారని తెలిపారు.