కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి సెక్రటరీగా జయలక్ష్మి నియమితులయ్యారు. గతంలో అనంతపురం మార్కెట్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన ఆమె, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కర్నూలుకు ఆన్‌డ్యూటీపై బదిలీ అయ్యారు. మంగళవారం తాజాగా బదిలీల్లో భాగంగా ఆమెను పూర్తిస్థాయి సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.