కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి సెక్రటరీగా ఆర్. జయలక్ష్మి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిప్యుటేషన్ పై కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీని అనంతపురం మార్కెట్ కు, అనంతపురంలో ఉన్న సెక్రటరీ జయలక్ష్మిని కర్నూలు మార్కెట్ కు బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయసునీత ఉత్తర్వులు జారీ చేశారు. గోవిందు బాధ్యతల నుంచి రిలీవ్ కావడంతో, సెక్రటరీగా ఆర్. జయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.