పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 18న జాబ్ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువిన 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని MLA శ్యాంబాబు, స్కిల్ అధికారి ఆనంద్ గురువారం తెలిపారు. 16 కంపెనీలు పాల్గొననున్న ఈ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను వారు విడుదల చేశారు.