కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 16 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పి. సోమ శివరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల సంస్థలు ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హత గల నిరుద్యోగులు విద్యార్హతల ధ్రువ పత్రాలు, ఫొటోలతో హాజరుకావాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు http: //www. ncs. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.