జూన్ 13న కర్నూలులో ఉద్యోగ మేళా నిర్వహణ

73చూసినవారు
జూన్ 13న కర్నూలులో ఉద్యోగ మేళా నిర్వహణ
కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూన్ 13న శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో ఉద్యోగ మేళా జరుగుతుందని ఉపాధి అధికారి పి. సోమశివారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వోడాఫోన్, ముత్తూట్ సంస్థలు ప్రమోటర్, ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని, టెన్త్ నుండి డిగ్రీ వారికి అవకాశమన్నారు. రూ. 10 వేల నుండి వేతనం ఉంటుందని, అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్