కొలిమిగుండ్ల: పొగాకు రైతులు దగా

58చూసినవారు
కొలిమిగుండ్ల: పొగాకు రైతులు దగా
ఉమ్మడి జిల్లాలో పొగాకు రైతులను కంపెనీలు దగా చేశాయి. సాగుకు ముందు పొగాకు కొనుగోలుకు హామీ ఇచ్చి, విత్తనాలు అందించి మరీ అన్నదాతలను ప్రోత్సహించిన కంపెనీలు, దిగుబడి వచ్చాకు కొనుగోలు చేయడానికి అడ్డగోలు నిబంధనలు పెడుతున్నాయి. దీంతో అన్నదాతలు లబో దిబోమంటున్నారు. కొనుగోళ్లకు కంపెనీలు కొర్రీలు పెడుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. రైతులు కంపెనీల వద్దకే పొగాకు తీసుకవెళ్లి అమ్ముకుంటున్నారు. దీంతో వారు ఇష్టానుసారంగా ధరలు చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారు. క్వింటాలుకు రూ.5000, నుంచి రూ.6500 మించి ధర పలకడంలేదని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్