సంక్రాంతి పండుగకు కర్నూలు ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం 104 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. శుక్రవారం 43 బస్సులు, శనివారం 37 బస్సులు, ఆదివారం 21 బస్సులు ఏర్పాటు చేశామని శుక్రవారం ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, చెన్నై, నెల్లూరు నుంచి బస్సులు రానున్నాయి. కర్నూలుకు చేరుకునే ప్రయాణికులకు గ్రామాలకు వెళ్లే బస్సుల సౌకర్యం లేకపోవడంతో అవస్థలు ఎదురవుతున్నాయి.