కర్నూలు: రూ. 23.91 కోట్లతో 133 అభివృద్ధి పనులు

81చూసినవారు
కర్నూలు: రూ. 23.91 కోట్లతో 133 అభివృద్ధి పనులు
కర్నూలు నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని ఆదివారం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పది నెలలుగా మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి దృష్టి సారించారని, రూ.23.91 కోట్లతో 133 అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటిలో రూ.3.05 కోట్ల విలువైన 38 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్