కర్నూలు జిల్లాలో శుక్రవారం 15 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, 173 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఇందులో కులధ్రువపత్రాల కోసం 3, 22ఏ నిషిద్ధ భూముల జాబితా కోసం 1, రీసర్వేకు 80, ఆర్ఓఆర్ కేసులకు 60, ఇతరాలకు 25, రోడ్డు వివాదాలకు 4 అర్జీలు వచ్చాయి. డిసెంబర్ 6 నుంచి జనవరి 3 వరకు మొత్తం 7, 413 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.