కర్నూలు జిల్లాలో శనివారం 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకు 7563 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ఆదోని, కర్నూలు, పత్తికొండ, క్రిష్ణగిరి, ఆలూరు మండలాలలో 173 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ సదస్సులు 6వ తేదీ నుండి 4 వరకు జరిగాయి. సోమవారం ఆదోని మండలంలోని దొడ్డనగేరి గ్రామంలో మరో రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు.