కర్నూలు జిల్లాలో శనివారం మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలు నిర్వహించారు. 739 మందిని పిలవగా, 327 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ పరీక్షలో హాజరయ్యారు. 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. 173 మంది మహిళా అభ్యర్థులు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అప్పీలు చేసిన అభ్యర్థులు జనవరి 28న హాజరు కావాలని జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ తెలిపారు.