కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్ధులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం 3వ రోజు కానిస్టేబుల్ మెయిన్స్ (ఫైనల్) పరీక్షకు 204 మంది ఎంపికయ్యారు. ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. 283 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ కు హజరయ్యారన్నారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.