కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో శుక్రవారం కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 600 మందిని పిలవగా, 283 మంది హాజరయ్యారు. ఫిజికల్ టెస్టుల అనంతరం 1600 మీటర్ల పరుగు పరీక్షలో 224 మంది, 100 మీటర్ల పరుగు పరీక్షలో 165 మంది, లాంగ్ జంప్‌లో 196 మంది అర్హత సాధించారు. మెయిన్స్‌కు 204 మంది ఎంపికయ్యారు. ఈ దేహదారుఢ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షించారు.